సోనియా చిరంజీవిల ఏకాంత సమావేశం వివరాలు. – Just For Fun

With malice to none including fans of Chiranjeevi! , Just for fun

సోనియా: పిలవగానే ఎగేసుకొచ్చినందుకు థాంక్స్.

చిరు: ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నా..!

సోనియా: మాకంటే ఇపుడు అవసరం వచ్చింది, మీరెందుకు ఎదురుచూస్తున్నారు?.

చిరు: ఏమి చెప్పమంటారు.. పార్టీ స్టేట్ ఆఫీసుకే దిక్కులేక మేమేడుస్తుంటే, జిల్లా ఆఫీసులు, మండల ఆఫీసులు బిల్డింగులకు అద్దె బకాయిలు చెల్లించాలని ఒకటే గోల. అదీ గాక…

సోనియా: సరే సరే, మీదరిద్రం వినేంత టైం లేదు.. మాకేం కావాలో తెలుసు కదా, మీ డిమాండ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి.

చిరు: ఏముంటాయండి.. కుదిరితే సిఎం పోస్టు, వీలైతే నాలుగు క్యాబినెట్ బెర్తులు… ఇంకా..

సోనియా: ఇక ఆపుతావా.. సిఎం పోస్టు అడిగినోడికల్లా ఇవ్వడానికి అదేమన్నా అరటిపండా.. అలా ఇచ్చేసేలా అయితే నిన్ను పిలవాల్సిన పనేముంది మాకు, జగన్ కే ఇచ్చేవాళ్ళంగా??

చిరు: అవుననుకోండి, కాకపోతే..

సోనియా: సరే సరే.. ఇంతకీ నమ్మి ఓట్లేసిన 70 లక్షల మందికి ఏంచెబుతావ్??
చిరు: అయ్యో.. అదేముందండి, మా తెలుగు రాష్ట్రంలో అదే ప్రత్యేకత. అభిమానం అనేది ఫిక్సిడ్ ఎస్సెట్. ఒక్కసారి పొందామంటే వెర్రిజనాలు మనకోసం చచ్చేదాకా ఎగబడుతూనే ఉంటారు.

సోనియా: మరి అపుడెపుడో ఈనాడులో జెండాపీకేద్దాం అన్న పతాకశీర్షిక వస్తే రెచ్చిపోయి తల్లి గొంతుని నులిపేసే కిరాతకుడిని కాను, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అభిమానుల అండదండలతో పార్టీని మరింత పటిష్టం చేస్తాం, జెండా ఎగరేస్తాం, జెండా నిలబెడతాం అని ఏవేవో చెప్పినట్టున్నావ్..??

చిరు: (తన స్టయిల్ లో సిగ్గుపడుతూ..) అప్పుడేదో ఆవేశంలో, మీరు చూసారా మేడం, బాగా చేసానా పెర్ఫార్మన్సు..?? అయినా మా తెలుగోళ్ళు తెల్లారితే అన్నీ మరిచిపోతారు మేడం. రేపొద్దున ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వస్తే చాలు.

సోనియా: సరే సరే, బయటకు వెళ్లి అహ్మద్ పటేల్ ఇచ్చిన పేపర్లో ఏముందో అది చదివేసి ఇంటికెళ్ళు.. ఇకనుంచి ఏంచెయ్యాలో నేను చెబుతాను, ఎలా చెయ్యాలో కిరణ్ చెబుతాడు. సొంత తెలివితేటలు వాడకు.

చిరు: జీ. అవే ఉంటే ఇలా ఎందుకు తయారవుతాను. బాగా చిరాకుగా ఉన్నట్టున్నారు, మాంచి స్టెప్ ఒక్కటి వేసి ఎంటర్ టైన్ చెయ్యమంటారా..? డాన్సు బాగా చేస్తాను అని చెబుతుంటారు అంతా.

సోనియా: చెయ్యాల్సిన డాన్సులు మున్ముందు చాలానే ఉన్నాయి, ఇక మూసుకుని బయలుదేరు.

చిరు: జీ మేడం. (కాళ్ళకు ఒక దణ్ణం పెట్టి నిష్క్రమణ)

ఇవాల్టి నుంచి మన మెగాస్టార్ చిరంజీవి కొత్త సిఎం. సిఎం అంటే, చీఫ్ మినిస్టర్ అనుకునేరు..

 కాదండి ‘కాంగ్రెస్ మాన్’. ఇంకా చెప్పాలంటే “చెమ్చా టు మేడం”

Advertisements

One thought on “సోనియా చిరంజీవిల ఏకాంత సమావేశం వివరాలు. – Just For Fun

  1. Pingback: ఇన్క చాలు, స్వయమ్ప్రతిపతే మేలు | స్వతంత్రం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s