ఆత్మహత్య

ఇది నా ఫెస్బుక్ స్నేహితుడు ఒకడు తన వాల్ లో రాశారు. బాగుంది అని బ్లోగ్ లో పెట్టా. అందారకు షేర్ చేద్దామని

ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా… ఐతే ఒక్కసారి మహాత్ముడి అనుభవాన్ని చదవండి

పరీక్ష ఫెయిలైనందుకు విద్యార్థి ఆత్మహత్య…
ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య…
పెళ్ళికాలేదని అమ్మాయి ఆత్మహత్య…
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య…
అత్త అవమానించిందని కోడలు ఆత్మహత్య
పంట చేతికి రాలేదని రైతు ఆత్మహత్య…
తెలంగాణా రాలేదని విద్యార్థుల ఆత్మహత్య… ఇవండీ రోజువారీ మనం చదివే వార్తలు

ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాకపోగా రకరకాల కొత్త సమస్యలకు మూలం అవుతుందని మనందరికీ తెలుసు. ఆత్మహత్యలు చేసుకునే మన సోదరులకు స్ఫూర్తి కాగలదనే అభిప్రాయంతో మహాత్ముడు తన జీవితంలో ఆత్మహత్యను జయించిన ఒక సంఘటన ఉదహరిస్తున్నాను. సౌతాఫ్రికాలో ఒకసారి గాంధీగారు రైలు ఫస్టుక్లాస్ కంపార్టుమెంటులో ప్రయాణిస్తుంటే తెల్లదొరలు తోసేశారు. ఇది మనందరికీ తెలుసు. కానీ ఈ సంఘటనలో మనకు పనికొచ్చే విషయం మరొకటుంది. రైలు నుండి తోసేయగానే ఆయన తీవ్ర అవమానంగా ఫీలయ్యారు. “ఇంతటి అవమానాన్ని భరించి ఇంకా బతికి వుండటమెందుకని” గాంధీజీకి అనిపించిందట. కానీ ఆ బలహీన క్షణంలో ఆయన తన మనసుకు ప్రశాంతంగా కౌన్సెలింగ్ చేశారు. వెంటనే మరొక ఆలోచన… “తెల్లవాళ్ళ దుష్ప్రవర్తనకి తనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి… ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతే సరి” అనుకుంటూ మళ్ళీ తన మనసును ఆలోచింపజేశారు. “ఆత్మహత్య చేసుకోనూ వద్దు, ఈ దేశాన్ని విడిచి వెళ్ళనూ వద్దు, నేను ఇక్కడే వుంటాను, ఈ తెల్లదొరల జాత్యహంకారానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తాను.” ఇదీ గాంధీజీ సెల్ఫ్ కౌన్సెలింగ్ ప్రక్రియ. ఆ తరువాత ఆయన ఎలా అంతర్జాతీయ నాయకుడయ్యారో మనకు తెలుసు. నేడు ప్రతి చిన్న విషయానికీ ఆత్మహత్యకు పాల్పడేవారు ఈ సంఘటనను గుర్తుచేసుకుని ఆత్మహత్యను వాయిదా వేసుకోవాలని ప్రేమతో కోరుతున్నా!
“ఆత్మహత్యకు పాల్పడే వాడు అత్యంత పిరికివాడయితే, ఆత్మహత్య చేసుకున్నవాడిగురించి గొప్పగా చెప్పేవాడు పరమ మూర్ఖుడు.”

Advertisements