మోడి మంత్రం ఫలిస్తుందా?

modi1

నరేంద్ర మోడి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించాడు. భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టాడు. 2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీ దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి కష్టం కల్గించాయి. దేశవ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యాడు.

 

2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్‌ శాసన సభ ఎన్నికలలో మొత్తం 182 స్థానాలకుగా ను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలలో విజయం చేకుర్చి వరుసగా రెండోసారి ముఖ్య మంత్రి అయ్యాడు. 2002 గుజరాత్‌ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నా డు. గుజరాత్‌ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలి గా పేరుతెచ్చుకున్నాడు.

 

అనూహ్య అభివృద్ధి…

 • 1995-96 సంవత్సరానికి దేశం తలసరి ఆదాయం రూ 2,573 గా ఉండగా, ఇదే ఏడాదికి గుజరాత్‌ తలసరి ఆదాయం రూ 3,172.
 • మొత్తం దేశంలో అక్షరాస్యత 52.21 శాతం ఉండగా గుజరాత్‌లో 61.31 శాతంగా ఉంది.
 • గుజరాత్‌ రాష్ట్రంలో 1,628 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. ఈ ప్రాంతంలో 41 రేవులున్నాయి. వీటిలో అన్నిటికంటే పెద్దది కాండ్లాలో ఉంది. ఇదే కాక 11 మధ్యతరహా రేవులు 29 చిన్న రేవులు వున్నాయి. ప్రయివేటు పెట్టుబడులతో మరో 10 కొత్త రేవులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 • పారిశ్రామిక విధానంలో భాగంగా మానవ వనరుల అభివృద్ధిపై గుజరాత్‌ సర్కారు ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ప్రస్తుతం 20 ఇంజనీరింగ్‌ కళాశాలలు, 27 పాలిటెక్నిక్‌, 200 సంస్థలు వృత్తిపరమైన శిక్షణనందిస్తున్నాయి. దీనితో పాటు మరికొన్ని సంస్థలు బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు బోధిస్తున్నాయి. ఈ విద్యా, శిక్షణా సంస్థలు పారిశ్రామిక పెరుగుదలకు దోహదం చేస్తాయి. పరిశ్రమలకు అవసరమైన సుశిక్షితులైన సిబ్బంది నిర్విరామంగా అందుతుం టుంది. రాష్ట్ర విస్తరణకనుగుణంగా కొత్తకొత్త కోర్సులను రూపకల్పన చేసి బోధిస్తున్నారు. ఈ సందర్భంలో ప్రయివేటు ఇన్వెస్టర్లకు పెద్దపెద్ద అవకాశాలు లభిస్తాయి. జాతీ య రహదారుల సముదాయంతో చేతులు కలిపి ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళే రైలు మా ర్గాన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చారు. ఫలితంగా ఈ ప్రాంతానికి ముంబై ఢిల్లీ వాణిజ్య కేంద్రాలకు సరాసరి రవాణా రాకపోకలు ఏర్పడ్డాయి.
 • వ్యాపారవేత్తలకు సదుపాయాలు అందుబాటులో ఉన్న వల్సాద్‌, సూరత్‌, భరూచ్‌, వదోదరా, ఆనంద్‌, నడియాడ్‌, అహ్మాదాబాద్‌ పట్టణ కేంద్రాల్లో జి.ఐ.డి.సి (గుజరాత్‌ ఇండస్ట్రియల్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఎన్నో పారిశ్రామిక యూనిట్లు నెలకొల్పింది.
 • గుజరాత్‌లో 12 శాతం పారిశ్రామిక ప్రగతి రేటు నమోదైంది. రూ 50,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రం 21 శతాబ్దంలోకి దూసుకుపోతోంది.
 • ఆవిర్భావం నుంచి దేశంలో జౌళిపరిశ్రమ కేంద్రంగా విశిష్ట స్థానాన్ని గుజరాత్‌ సంపాదించుకుంది. అహ్మదాబాద్‌ భారత్‌లో మాంచెస్టర్‌గా కీర్తిగాంచింది. ఇక్కడ పారిశ్రామిక కార్మికుల జనాభా అధికంగా ఉంది. జౌళి పరిశ్రమ పతనం కావడంతో రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్‌ కేంద్రాలపై శ్రద్ధ చూపుతున్నారు. దేశంలో శ్వేత విప్లవానికి గుజరాత్‌ ఉదయతారగా ప్రసిద్ధిగాంచింది. గుజరాత్‌లో భారీఎత్తున పాలకేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. గుజరాత్‌లో చమురు క్షేత్రాలను వెలికితీయడం మరో కలికితురాయి. ఫలితంగా సహజవాయువు ముడిచమురు పెద్దెత్తున్న ఉన్న ప్రాంతాల్లో గుజరాత్‌ అగ్రస్థానంలో ఉంది. గుజరాత్‌ రిఫైనరీతోపాటు సౌరాష్ట్రా ప్రాంతంలో మరో భారీ రిఫైనరీ నెలకొల్పాలని గుజరాత్‌ ప్రభుత్వం తలపెట్టింది.

 ఇవీ అనుకూలాంశాలు…

 • ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పారిశ్రామిక దిగ్గజాలైన రిలయన్స్‌, అదానీ, టొరెంట్‌, లార్సన్‌ అండ్‌ టూబ్రో వంటి సంస్థల అధిపతులకు పుట్టినిల్లు గుజరాత్‌.
 • వ్యాపార రంగ ప్రముఖలను శతాబ్దాల క్రితమే అందించిన రాష్ట్రం. భారత పారిశ్రామిక రంగాన్ని శాసించిన ధీరూభాయ్‌ అంబానీ ఈ గడ్డమీదే పురుడుపోసుకున్నాడు.
 • భారత వ్యాపార రాజధాని ముంబై నగరానికి భౌగోళికంగా చేరువలో ఉండడం కలిసొచ్చే మరో అంశం.
 • ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఓడరేవులకు నెలవు.
 • సహజవనరులైన విద్యుత్‌, సహజవాయువు, ముడి సరుకులకు కొదువలేదు.
 • సరికొత్త భూ కొనుగోలు విధానాన్ని అమలు పరచడం ద్వారా అన్ని రాష్ట్రాలకంటే పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుంది.
 • మార్కెట్‌ ధరకు భూమిని కొనుగోలు చేయడం. రైతులకు, ఫ్యాక్టరీ లాభాల్లో వాటా, భూమి కోల్పోయినవారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వంటి నిబంధనలు పకడ్బందీగా అమలవుతుండడంతో భూపోరాటాలు చాలా తక్కువ. ఇది పెట్టుబడులకు ఎంతగానో అనుకూలించే అంశం. ఇలాంటి అందరికీ ఆమోదయోగ్యమైన సంస్కరణ దృష్ట్యా ఇప్పుడు గుజరాత్‌ పారిశ్రామిక వర్గాలను అమితంగా ఆకట్టుకుంటోంది.

2007 డిసెంబర్లో జరిగిన గుజరాత్‌ శాసన సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. ఈ మధ్యకాలంలో ఏ ఎన్నికలకూ లేని విశేష ప్రాధాన్యత గుజరాత్‌ ఎన్నికలకు లభించిందం టే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. కే వలం ఒక రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆ ర్షించడానికి కారణం జరగబోయే లోక్‌సభ ఎ న్నికలను ప్రభావితం చేయడమే. అంతేకా కుండా భాజపా తరఫున ప్రధానమంత్రి అభ్య ర్థిగా ప్రకటించబడిన లాల్‌ కృష్ణ అద్వానీది గుజరాతే. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోని యా గాంధీ రాజకీయ కార్యదర్శి కూడా గుజ రాత్‌కే చెందినవాడు. ఇటీవలకాలంలో అధికా రంలో ఉంటూ మళ్ళీ పార్టీని గెలిపించిన సం దర్భాలు తక్కువే.

అటువంటిది వరుసగా మూడో పర్యాయం 182 స్థానాలకుగా ను 117 స్థానాలు పొందటం విషేశం. ఆయన స్వయం గా మణినగర్‌ శాసనసభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, కేంద్రమంత్రి అయిన దిన్షా పటేల్‌ పై 87,161 ఓట్ల తేడాతో ఘనవి జయం సాధించాడు. గుజరాత్‌లో భాజపా ప్ర భుత్వం ఏర్పడటం ఇది 4 వ సారి కాగా నరేం ద్ర మోడి సర్కారు ఏర్పడటం 3వ పర్యాయం. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, మధ్య గుజరాత్‌, దక్షిణ గుజరాత్‌, ఉత్తర గుజరాత్‌ అన్నంటి లోనే భాజ పా స్పష్టమైన మెజారిటీ సాధించింది.

 వ్యవసాయం లోనూ పదిశాతం వృద్ధిరేటుతో దూసుకెళ్తున్న మోడీ అభివృద్ధి పథంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పథనిర్ధేశకుడే! అందుకే 2014 కు సుష్మా స్వరాజ్, జైట్లే, వెంకయ్య నాయుడులను కాదని బి‌జే‌పి ఎన్నికల ప్రచార కమిటీకు ఛైర్మన్ గా నియమించి ఎన్నికలకు పోవటానికి నిశ్చయించుకుంది. దీనితో బి‌జే‌పి లో అద్వానీ, వాజ్పేయే శకము ముగిసి నవతరము నకు పగ్గాలు ఇచ్చినట్లు అయ్యింది;  

 article

బిజేపీ మాత్రం ఒక వర్గంలో ఆయనకున్న పలుకుబడిని, ఆయనలోని సమర్థ నాయకత్వాన్ని సొమ్ము చేసుకో వాలని చూస్తున్నది. యూపీఏ కూటమికి సమర్థ నాయకత్వం కొరవడడం తమకు వరంగా మారుతుందని కమలనాథులు భావిస్తున్నారు. కుంభకోణాల్లో కూరుకు పోయిన యూపీఏ చితికిపోవడం ఖాయమని 2014 ఎన్నికల్లో తమకే విజయా వకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిజేపీ భావిస్తున్నది. అందుకే, అవినీతి మచ్చలేని మోడీని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే గట్టి హిందూత్వ వాదిగా ముద్రపడిన మోడీని ఓటర్లు ఆదరిస్తారా అన్నది ప్రశ్నే. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమొరికా ఇప్పుడు ఆయనను భావి ప్రధాని అభ్యర్థిగా గుర్తించింది. తన అభిప్రాయాన్ని అమెరికా మార్చుకున్నంత తేలికగా.. దేశప్రజలు మోడీపై పడిన ముద్రను మరచిపోతారా? మొత్తానికి బిజేపీకి మోడీ భారమవుతారో, వరం అవతారో 2014లో గానీ తేలదు

 

 

Advertisements

One thought on “మోడి మంత్రం ఫలిస్తుందా?

 1. . భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టినాడు. 2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి కష్టం కల్గించాయి. దేశ వ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యాడు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s