బి‌జే‌పి లో ఇప్పుడు నడిచేది తరాల మార్పు పోటీ , అద్వానీ 2009 లోనే రాజకీయాలనుండి విరమించవలసింది

nomody2009 డిసెంబర్ లో RSS నితిన్ గడ్కారి ను బిజెపి అధ్యక్షుడు చేసి, సుష్మా స్వరాజ్ మరియు అరుణ్ జైట్లీ లను వరుసగా లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు చేస్తూ తీసుకున్న నిర్ణయము వెనుక కు అద్వానీ ఒక గురువు యొక్క పాత్రను ఇచ్చి ఆయన్ను గురువుగా వ్యవహరించు అన్న సంకేతాన్ని ఇండిరెక్ట్ గా నే ఇచ్చింది; ఆ మార్పు బి‌జే‌పి లో ఒక తరాల మార్పు ను అద్వానీ ద్వారా పర్యవేక్షించవచ్చు అని ఆర్‌ఎస్‌ఎస్, బి‌జే‌పి ల ఒక్క ఎక్స్పెక్టేషన్స్, కానీ అది జరగలేదు. ఆర్‌ఎస్‌ఎస్ ఆ మార్పును పారదర్శకత్వము లేకుండానే ఇండిరెక్ట్ గా చేయటము వల్ల అద్వానీ కూడా ఈ మార్పును అంగీకరించ్నట్లు కనిపించలేదు;

 

మూడున్నర సంవత్సరాల తరువాత, తన చేదు వ్యతిరేకత ఉన్నప్పటికీ బిజెపి ప్రచారం కమిటీ అధిపతిగా నరేంద్ర మోడీ పేరు నిర్ణయం అద్వానీ కు కఠినమైన స్పష్టమైన సంకేతం. ఈ స్క్రిప్ట్ కనుక సరిగా చదివినట్లయితే ఆర్‌ఎస్‌ఎస్ ఒక్క మనస్సులోని మాట, నిర్ణయము అద్వానీకు అర్ధము అయ్యేది.
2009 లో మన్మోహన్ సింగ్ ను భారతదేశం యొక్క బలహీనమైన PM వంటి అపహాస్యం ఒక సమగ్ర నష్టం అని కనుక అద్వానీ అనుకోని వుంటే 2009 లోనే బి‌జే‌పి కి రాజీనామా చేసి, రాజకీయాలకు స్వస్తి చెప్పి, యువ రక్తాన్ని నడిపించేవారు అద్వానీ; కానీ అలా చేయని వ్యక్తికి , గోవా లోని జాతీయ కమిటీ లో జరిగిన సంఘటనలు చాలా అవమానముగా అనిపించి వుండవచ్చు;
అద్వానీ , తన చేతిలో మెరుగులు దిద్దుకున్న ఒక నాయకుడిని కొత్త నాయకుడిగా చూడటము ఇస్తము లేని ఆయన ఒక వైరల్ పేరుతో ఢిల్లీ లో తనను తాను నిర్బంధించుకోవడము అనే తన నిర్ణయం నిర్లక్ష్యం అనే చెప్పుకోవచ్చు. ఒక బోల్డ్ నిర్ణయం తీసుకున్నందుకు పార్టీ చీఫ్ రాజ్నాథ్ సింగ్ ను బిజెపి నాయకుడు అరుణ్ జైట్లీ అభినందించారు. సింగ్ కూడా తాను ప్రచారం ప్యానెల్ హెడ్ కు మోడీ పేరును సూచించటానికి ఒక క్షణం వెనుకాడలేదు అని అన్నారు మరియు మోడి ఒకసారి కూడా తన ప్రసంగములో అద్వానీ పేరు పేర్కొనలేదు. కేవలము ఒక ట్వీట్ లో మాత్రము మోడీ తాను అద్వానీ తో మాట్లాడాను, ఆయన దీవెనలు పొందాను అన్నారు. ఇది ప్రతిభను ప్రోత్సహిస్తూ ఒక నాయకుడిగా 90 లో కనిపించిన అద్వానీ లో కనిపించిన దైర్యం సత్ర్హువల మీదకు యుధ్ధానికి సిధ్ధము అయిన మోడి కు లాఠీ అందచేయాలని దైర్యం మరియు అతని స్వాగతం పర్యవేక్షించేందుకు అద్వానీ కి పెద్ద మనస్సు రాలేదు అని మాత్రము నిజము;
అద్వానీ 2005 పాకిస్తాన్ పర్యటన లో తన “జిన్నా లౌకిక వాదే” అని వ్యాఖ్యలు చేసినప్పటి నుండి ఆర్‌ఎస్‌ఎస్ తో, మరియు పార్టీ భావ జలము నుండి దూరము అయిపోయాడనే వాదన చాలా వుంది; అప్పుడు వీచిన పెను గాలి వెళ్లిపోవుటకు చాలా రోజులే పట్టింది;  అసలు 2009 ఎన్నికలకు ముందే అద్వానీ ను పక్కకు తప్పించి యువ రక్తానికి పార్టీ లో చోటు కలిపించాలని అనుకున్న బి‌జే‌పి , ఆర్‌ఎస్‌ఎస్ పెద్దల యోచన కు , పార్టీ లోని రెండవ నాయకత్వము ఇంకా సిధ్ధము కాలేదని మాత్రమే అద్వానీ కి చేత కానీ పరిస్థితులలో బి‌జే‌పి ని ముందుకు తీసుకెల్లే నాయకత్వము ఇచ్చారని ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు చెప్పుకుంటూ వుంటాయి;
2014 ఎన్నికలకు , మరియు దానికి ముందు జరిగీ అసెంబ్లీ ఎన్నికలు కోసం తాను వైదొలిగి ప్రక్కన నిలబడటానికి ఇస్త పడక ఈ యేడాదే రాజీనామా  చేసిన గడ్కారీ అద్యక్షతన ఒక “కౌంటర్ ప్యానెల్” ప్రతిపాదించి మోడీ కి వ్యతిరేకంగా ప్రయత్నించారని స్పష్టమైనది. మోడీ ఎంపిక బి‌జే‌పి కి  నస్తము, ఎన్నికలు polarize అవుతాయి అన్న వాదన రథయాత్ర రచయిత అయిన అద్వానీ  నోటి నుండి రావతము హాస్యాస్పదం.
వరుస స్కామ్ లతో కొట్టుమిట్టాడుతూ తన కన్నా చాలా పిన్న వయస్సు వున్న  అనుభవము లేని రాహుల్ ని ప్రధాన మంత్రి అబ్యర్ధిగా ప్రకటించిన ఈ సమయములో బి‌జే‌పి ఆటోమేటిక్ గా గెలిచి , వాజ్పేయే లాగా తాను కూడా ప్రధాన మంత్రి పదవిని అలకరించాలన్న ఆశ అద్వానీలో వుండి వుండవచ్కు ; కానీ బి‌జే‌పి లోని ఇతర వర్గాలకు 3 సార్లు సి‌ఎం గా గుజరాత్ లో బి‌జే‌పి ని ఆగ్ర పధానికి నడిపించి , ముక్యముగా బి‌జే‌పి యొక్క మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ తో దగ్గరి సంభధాలు గలిగి, బి‌జే‌పి లోని యువ నేతలు, 3 సి‌ఎం ల సపోర్ట్ , దేశములో గత 2,3 యేళ్ళ నుండి దేశములో మోడి ప్రధాని కావాలి, కాంగ్రెస్ కు మోడి యే సరి అయిన ప్రత్యామ్నాయము అన్న మూడ్ ను గ్రహించటములో అద్వానీ తప్పకుండా fail అయినట్లున్నారు;

తాజాగా గోవా సి‌ఎం మనోహర పరికర్ అద్వానీ ఒక్క రాజీనామను స్వాగతించి రాజకీయాలలో రిటైర్మెంట్ కు ఒక వయస్సు వుండాలి అని అనతము కూడా బి‌జే‌పి లోని యువ నేతల పట్టుదలకు అద్దము పడుతోంది; అద్వానీ ను కాదని ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవటానికి బి‌జే‌పి, ఆర్‌ఎస్‌ఎస్ చాలా పెద్ద అనాలిసిస్ చేశారని, ఆర్‌ఎస్‌ఎస్ ఈ విషయములో పట్టుదలతో వున్నదని విషయాన్ని ఇంత వయస్సు , అనుభవము కలిగిన అద్వానీ ముందే వూహించకపోవతము కొంచెము ఆశ్చర్యయముగానే వుంది;

 

భారత దేశములో రాజకీయ నాయకులకు, సినిమా , క్రీడా సెలిబ్రిటీ లకు తమ ఒక్క రిటైర్మెంట్ ను వూహించటము , ప్లాన్ చేసుకోవతము వచ్చినట్లు లేదు, చివరి వరకు పాకులాడి అవమాన పరిస్థితుల్లో బయట పడినవారే ఎక్కువ.  ఆ జాబితాలోకి అద్వానీ చేరిపోవతము ఒక రకముగా బాధకారమే.

 

Advertisements

One thought on “బి‌జే‌పి లో ఇప్పుడు నడిచేది తరాల మార్పు పోటీ , అద్వానీ 2009 లోనే రాజకీయాలనుండి విరమించవలసింది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s