సీమాంద్ర ప్రజల దృస్టిలో సమ న్యాయము అంటే

download

నేను గుంటూర్ లో ఒక 2 రోజులు వున్నాను శని, ఆది వారాలు; నాకు వున్న interest కొద్ది నాకు తెలిసిన న్యాయవాదుల, విద్యావంతుల జే‌ఏ‌సి ల నిరసన దీక్షల దగ్గరకు అక్కడ వున్న నాకు తెలిసిన జనాలను కదిపితే రాస్త్ర విభజన మీద, వారికి ఏమి కావాలి అన్న దాని మీద జనాలకు వున్న క్లారీతి డిల్లీ , హైదరాబాద్ లలో కూర్చొని ఇది కావాలి అది కావాలి అని కమీటీల దగ్గరకు పోతున్న సీమాంద్ర నాయకులకు లేదేమో అనిపిస్తోంది;

1176306_1404540996429538_162970461_n

ప్రస్తుతము వున్న పరిస్థితుల్లో సమ న్యాయము అంటే అన్నీ రంగములో ఎవరు ఏమి కోల్పోకూడదు; ఒక ప్రాంతమే ఏమి లాభము పొందకూడదు; వుద్యోగాలలో కానీ, నీతి వనరులు గాని, హైదరాబాద్ విషయములో కానీ, మౌలిక అవసరముల కల్పనలో గాని, ఇప్పటికీ వున్న వనరుల పంపకములో గాని అందరికీ న్యాయము జరగాలి;

  1. అభివృద్ధి కేంద్రీకరణ, యువత కు వుద్యోగ కల్పనలు : రాస్త్రములో వున్న 95% ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ఇన్స్టిట్యూట్ లు హైదరాబాద్ లో వున్నయి, ఆఖరకు విశాఖలోనో, చీరాల , మచిలీ పట్నము లోనో వుండవలసిన సునామీ కేంద్రన్ని కూడా తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టారు; వీటిల్లో ఎన్ని కొత్త రాస్త్రములో వస్తాయి, దానికి టైమ్ బౌండ్ ఏమిటి? ఎవరు ఈ విధముగా తెస్తారు? ఎవరితో పోట్లాడవలసిన అవసరము వస్తుంది అన్నది తేలాలి; దానికి సమాధానాలు రావలసిన అవసరము చాలా వుంది; అప్పటి వరకు కొత్త రాస్త్ర యువత భావిస్యత్ ఏమిటి? హైదరాబాద్ కు రండి వుద్యోగాలు వద్దు అంటే హఠాత్తుగా ఎక్కడకు పోతారు?  1186232_568136946576066_1402170943_n
  2. నీటి వనరులు: ఇక నీటి వనరులు, జూరాల, నాగార్జున సాగర్ తెలంగాణ లో వున్నాయి, శ్రీశైలము సీమాంద్ర లోకి వస్తుంది; ఇప్పుడు ఒక చోట నిండినా నిండక పోయిన ఎడమ కాలువ కు కొన్ని రోజులు, కుడి కాలువకు కొన్ని రోజులు సమ న్యాయము చేసుకుంటూ అందరికీ నొచ్చకుండా manage చేసుకుంటున్నారు; శ్రీ శైలం ప్రాజెక్టు క్రింద సీమలోని నాలుగు జిల్లాలకు తెలంగాణలోని రెండు జిల్లాలకు , కోస్తా ప్రాంతంలోని రెండు జిల్లాలకు నీళ్లు అందుతున్నాయి. రా ష్ట్ర విభజన జరిగితే ఈ నీటిని ఎలా పంపిణీ చేస్తారు? శ్రీశైలం డ్యాం నీటిమట్టం 885 అడుగులకు చేరితేనే నాగార్జున సాగర్‌కు నీరు వదలాల్సి ఉండగా 854 అడుగులకే స్థిరీకరించి అన్నీ ప్రాంతాలకు సమ న్యాయము చేస్తూ manage చేస్తున్నారు;  రెపొద్దున తెలంగాణ ఏర్పాటు జరగకానే జూరాల నిండితే కానీ శ్రీశైలము కు ఇవ్వము, శ్రీశైలము నిండితే గాని సాగర్ కు , సాగర్ పూర్తిగా నిండితే కాని కిందకు నీళ్లు ఇవ్వము అని పీట ముడులు వేసుకొని  కూర్చుంటే సాగర్ కింద వున్న పంట పొలలకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఎలా న్యాయము సాగుతుంది? ఇప్పటికే ఒంగోల్, ప్రకాశము, నెల్లోరే జిల్లా వారికి ఒకటో పంట లేకుండా రెంతో పంట మాత్రమే సాగుతూ వస్తోంది; ఇప్పుడు ఇలా కొట్టుకుంటూ నేను నీళ్ళు విడవను అంటే క్రింద వారికి పొలాలకు కాదు కదా, తాగటానికి కూడా నీళ్ళు వుండవు; అసలు ఇవన్నీ ఎలా సాల్వ్ చేసుకుంటారు; వాటర్ ఆధాలత్ లు, త్రిబునల్ లు అంటున్నారు; నిజముగా వీటికి వున్న విలువ ఏమిటి? ఎవరు వింటున్నరు? ఇప్పటికే మన కళ్ల ముందు జరుగుతున్న తమిళనాడు , karnataka ల మద్య నలుగుతున్న వాటర్ సమస్య తెలిసిందే. ఇలా ప్రతి దానికి యుద్దం చేసుకుంటూ పోతే.. చివరకు మిగిలేది ఏమిట ి? ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచిస్తే మానవ జాతికే పూర్తి నష్టం కదా?Heavy_water_flow_from_Srisailam_dam
  3. పోలవరము పోలవరము ప్రాజెక్టు అంటున్నారు; ఒక పక్క ఖమ్మము , భద్రాచలము కూడా తెలంగాణ లో కలవాలి అంటున్నారు; ఇక పోలవరము ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది? దానికి నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి? అసలు అనుమతులు ఎక్కడ నుండి వస్తాయి? ఒరిస్సా వొప్పుకుంటుందా? ఒరిస్సా కోర్ట్ కి పోతే అది ఎప్పటికీ తేలేను? అప్పటి దాక నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి? పయిన నిండితే కానీ క్రింద నిండని రిసెర్వాయర్ లకు పయిన అడ్డు కట్టలు వేసుకొని కూర్చుంటే క్రింద వారి పరిస్తితి ఏమిటి? పయి వారి దయా దాక్షిన్యాల మీద నడవవలసిందేPolavaramProject001
    1. హైదరాబాద్ లో ప్రజల భద్రత  : 10 యేళ్ళు వుండండి మీది మీరు నిర్మించుకోండి తరువాత వెళ్లిపో అంటే సాద్యమేనా? 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అని లెక్కలు తేల్చి చెపుతున్నారు, అవి ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు? అవన్నీ చేయతములో ఎవరు సహాయ పడతారు? ఇప్పుడు  రాస్త్రము మొత్తము మీద ఏ రంగములో ఒక రకముగా డిగ్రీ చదివిన వ్యక్తి అయిన వుద్యోగానికి హైదరాబాద్ రావలసిందే; మీరు ఇక్కడకు వుద్యోగాలకు రావద్దు, బతకటానికి రండి అన్న ప్రకటనలు మీరు వినే వింటారు, అలాంటి వాటిల్లో చాలా వాటిల్లో చాలా క్లారీతి రావలసిన అవసరము చాలా వుంది;  వుమ్మడి రాస్త్రములోనే ఏ‌పి ఎన్‌జి‌ఓ హౌస్ లో ఆఫీసు లోపల ఏర్పాటు చేసుకొన్న సమావేశాలకె దిక్కు లేదు, ఇక 10 యేళ్ళు ఎలా వుంటారు, ఎలా భద్రత అన్నది కూడా ఆలోచించాలి కదా?  తెలంగానా  రాష్ట్రం ఏర్పడితే సీమాంద్రుల ఆస్తులు, వ్యక్తిగత రక్షణ,    సమస్యగా మారుతుందని సీమాంద్రులు బయపడడానికి   కారణం తెలంగాణా ప్రాంత నాయకుల రెచ్చగొట్టే మాటలు.. దానికి సెటిలర్స్ రక్షణ గురించి, వారు అడుగుతుంది ప్రత్యేక  చట్ట రక్షణ, ప్రభుత్వ రక్షణ. అంతే కానీ తెలంగాణా రాజకీయ నాయకుల ఇచ్చే వ్యక్తిగత లేక సామూహిక హామీలు కావు. ఒక వేళ తెలంగాణ నాయకులు బాడీ గార్డులు గా రూపాంతరం చెంది, సీమాండ్రులకు కి రక్షణ ఇస్తామన్నా, వారి సేవలు పొందడానికి ఏ సీమంద్రుడు   సిద్దంగ లేడు. ఆసలు సీమంద్రుడు బయపడేది తెలంగాణ రాజకీయ నాయకులకే తప్ప, తెలంగాణ లోని సామాన్య  ప్రజలకు కాదు. తెలంగాణా ప్రజలు, ఆంద్రా ప్రజల మద్య ఉన్నది సోదరబావమే తప్ప వేరే అనుమానలు ఏమి లేవు. వచ్చిన సమస్యల్లా రాజకీయ నాయకులతోనే.  N.T.R  వచ్చే దాక హైద్రాబాద్ లో మత ఘర్షణలు ఆపిన  వాడే లేడు . అసలు వాటిని పెంచి పోషించింది రాజకీయ నాయకులే అనేది జగమెరిగిన సత్యం.మరి అటువంటి నాయకులు “మా పోన్ నంబర్ తీసుకోండి. మీకెవరైన ఆపద కలిగిస్తే మాకు పోన్ చెయ్యండి. మీ ప్రాణాలకు మా ప్రాణాలు  అడ్డం” అని సినిమా డైలాగులు కొడుతూంటే తెలంగాణ వారికే అనుమానం వస్తుందట! ఇదేంట్రా బాబూ, వీరేదో తెలంగాణా  రాష్ట్రం తెచ్చి, మనకు ఉద్యోగాలు ఇప్పిస్తారు అనుకుంటే, సీమాంద్రులకు బాడీ గార్డులుగ పని చెయ్యడానికి ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇలా ప్రకటణలు ఇస్తున్నారేమిటా? అని.

సీమాంద్ర నాయకులు అసలు యిప్పుడు చేస్తున్న అలజడి ఆ విభజన నిర్ణయానికి ముందుగానే చేసుండవలసినది. ప్రజలు కూడా మానసికంగా తయారయ్యి వుండేవరు లేదా అప్పుడే యీ వుద్యమం మొదలయ్యి వుండేది.  ఇప్పుడున్న అవమానకర పరిస్థితి వుండేది కాదు. ఇపుడు ఏవిధమైన ఒడంబదిక లేకుందా విభజన నిర్ణయం రాయలసీమ ప్రాంతీయులకు ఎక్కువ క్షోభ కలిగించే విషయము. ఇది జరిగిన తర్వాత సీమ కోస్తాల మధ్య తగవులాట బాకీ వుంది. మొత్తం మీద యీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రులని వీధిన పడేసిందిం ఈ పరిస్థితులలో పార్లమెంటులో వున్న కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటూ యింకా అడుగులకు మడుగులొత్తుకుంటూ వెనకాల తిరుగుతారో అర్ధం కావడం లేదు. ఇప్పతికైనా చావా రేవా అనే స్థితిలో కేంద్రం మీద అధిష్టానం మీద పోరాడవలసిన సమయం. అంతా డబ్బుకు తొత్తుల్లా వుండేవాళ్లల్లా కనబడుతోంది. ఈ నాయకులవల్ల ప్రజలకు అవమానాలే తప్ప ఆరామ దొరకదన్నది అర్ధము అవుతోంది అందుకే ప్రజలే స్వశ్చందముగా నడుపుకుంటున్న వుద్యమము ఇది; కాంగ్రెస్, టి‌డి‌పి నాయకులు వుద్యమములోకి వస్తే ఏమవుతుందో జే‌సి, శైలజానాథ్, తులసి రెడ్డి, పయ్యావుల కేశవ్ కు సీమాంద్ర ప్రజలు చాలానే రుచి చూపించారు; ఏ‌పి ఎన్‌జి‌ఓ వుద్యోగులు కేంద్ర మంత్రులకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేశారు;

సీమాంద్ర ప్రజల ఆవేదన, వుద్యమము తెలంగాణ రాస్త్ర ఏర్పాటు కి వ్యతిరేకము అయితే కాదు; కానీ విభజన అనివార్యము అయినప్పుడు , తద్వారా ఏర్పడే సమస్యలకు పరిస్కారము ఎలా చూపిస్తారు , ఎలా సమ న్యాయము చేస్తారు అని మాత్రమే డిమాండ్; అది తెలియకుండా సీమాంద్ర నాయకులు వారి రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటూ అసలు ప్రజల సమస్యలను అందవలసిన వారికి అందకుండా చేస్తున్నాఋ అన్నది ప్రజల ఆవేదన; కేంద్రము కూడా సమస్యలు చెప్పండి అంటూ ఆంటోని కమీటీ లాంటి అనధికార కమిటీ వేసినప్పుడు ఆ అనధికార కమిటీను ఎవరు కలుస్తారు? ఎలా కలుస్తారు? కనీసము ప్రభుత్వ వుద్యోగులు కలిసినా దానికి చట్ట బద్ధ్దము ఏముంది? ఏ విద్వంసము లేకుండా ప్రశాంతముగా జరుగుతున్న వుద్యమము కదా కొంచెము లైట్ గా తీసుకుందాము అని అనుకుంటున్నారేమో పాలకులే చెప్పాలి;

Advertisements

One thought on “సీమాంద్ర ప్రజల దృస్టిలో సమ న్యాయము అంటే

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s