ఆంటోని కమిటీ సమస్య సాగతీతలో భాగమేనా?

3-sabb

 

తెలంగాణ ను రాజ్యాంగబధ్ధముగా మాత్రమే ఏర్పాటు చేస్తాము అని ముందు 6 నెలలు అని, తరువాత 2 యేళ్ళ లోపు పట్టఛ్కు అని చెప్పి 2014 ఎన్నికల ముందు తెలంగాణ ఏర్పడదు అన్న వాతావరణాన్ని సిధ్ధము చేశారు; దిగ్విజయ్ సింగ్ ఒక సారి తెలంగాణ ఏర్పాటుకి రాజ్యాంగ సవరణ అవసరము అని, రాస్త్ర ఏర్పాటుకి అసెంబ్లి తీర్మానముతో పని లేదు అని, మళ్ళీ మీ సమస్యలు అసెంబ్లి తీర్మాన చర్చలో చెప్పుకోవాలంటే మీరు రాజీనామా చేయకూడదని , చేయద్దు అని , మళ్ళీ ఇంకొక సారి మీ సమస్యలు ఆంటోని కమిటీ తో చెప్పుకొండి అని, ఇంకొక సారేమో అన్ని పార్టీ ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాము అని, చెపుతూ అగ్నికి ఆజ్యము పోస్తూ సాగతీస్తూ పోతున్నారు;

ఆంటోని కమిటీ రిపోర్ట్ ఈ రోజు కోర్ కమీటీలో చర్చిస్తారత; ఆ కమిటీ ఆంద్రప్రదేశ్ ప్రజల దగ్గరకు రాకుండానే, ఏదో కొద్ది మండి సీమాంద్ర కాంగ్రెస్ నాయకులను కలసి వారేదో చెప్పారు, అదే సమస్యకు పరిస్కారాలు అని తేల్చేసుకొని దాని కధ ముగిస్తారన్న మాట;పార్లమెంట్ అయిపోయింది కదా? పార్లమెంట్ వున్నంత వరకు సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు గోల చేస్తారని ఏదో కమిటీ వేసి ఏదో చర్చిస్తున్నారని వాతావరణము సృస్తించారు;

అయినా జనాల పిఛ్కి గాని కాంగ్రెస్ వారి అనధికార కమీటి రాస్త్రానికి వస్తే ఏమి రాకపోతే ఏమి? ఇది కూడా ఎర్రం నాయుడు నేతృత్వములో వేసిన టి‌డి‌పి తెలంగాణ కోర్ కమిటీ లాంటిదే; అధినాయకులు డిసైడ్ చేశారు; అలా డిసైడ్ చేసిన దానికి ఏదో ఒక కమిటీ అని మసి పూసి మారేడు కాయ చేసి చివరకు అధి నాయకులు ఏమి అనుకుంటునారో అలానే అందరూ అనుకుంటున్నారు అని డిసైడ్ చేసె కమిటీలే ఇవన్నీ. చివరకు అధి నాయకులు ఏమి అనుకుంటే గదే ఫైనల్. ఈ కమిటీలు ఆ కమిటీలు కేవలము టైమ్ పాస్ అంతే;

telangana-srikrishna-committee-300x257

చట్ట బధ్ధముగా ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటే రిపోర్ట్ మీద ఇంత వరకు అసెంబ్లి లో కానీ, పార్లమెంట్ లో ప్రవేశ పెట్టలేదు, దాని మీద చర్చ లేదు; మరి ప్రభుత్వ పరముగా ఏమి అధికారము లేని రాస్త్ర కాంగ్రెస్ పర్యవేక్షకుడు, కాంగ్రెస్ అద్యక్షురాలి రాజకీయ సలహాదారులతో కూడిన ఆంటోని కమిటీ కి చట్టబధ్ద్ధత ఏమిటి?  ఏ విధముగా చట్టబధ్ధము అయినది ఈ కమిటీ? ఏమి సంప్రదింపులు చేసింది? ఎవరిని కలుస్తుంది? ఎలా కలుస్తుంది? అలాగే ప్రధాన ప్రతిపక్షము కూడా కలవలేదు; మరి ప్రభుత్వ వుద్యోగులు ఈ  కమిటీ తో ఎలా కలుస్తారు అని అనుకున్నారు? ఏమని అడుగుతారు అనుకున్నారు? వేరే పార్టీలవారు ఎలా కలుస్తారు ఈ కమిటీని? ఒక వేల ఈ కమిటీను తక్కువ మండి కలిస్తే ఇంకో అధికార కమిటీ వేస్తారా? సంప్రదింపులు ముగిసాయని నిర్ణయమే తరువాయి అన్నప్పుడు ఇంకా కమిటీలతో పని ఏమి?  ఇదంతా చూస్తే రాస్త్రములో కన్ఫ్యూస్ క్రియేట్ అవతము లేదా? దీని వలన కాంగ్రెస్ కు కానీ, యూ‌పి‌ఏ కు కానీ వనగూరే రాజకీయ లబ్ఘి ఏమిటి?

ఇలా సాగతీయటము ద్వారా తెలంగాణ కు మేము అనుకూలమే , తెచ్చేది మేమే ఇచ్చేదీ మేమే అనే నినాదమును తెచ్చి తెలంగాణ రాస్త్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు అయ్యింది అని చెప్పి తెలంగాణ లో ఎక్కువ సీట్ లు, అదే విధముగా మీకు కూడా న్యాయము చేస్తున్నాము , చేస్తాము అని సీమాంద్ర లో మరి కొన్ని తెచ్చుకుందాం అన్న 2014 ప్లాన్ కాంగ్రెస్ చాల చక్క గా అమలు పరుస్తోందని అనుకోవచ్చా?

Advertisements