యాబై వేల కోట్లు ప్రాజెక్టు గోవిందా..గోవిందా!

AadharImg మన సర్కార్లు ఎంతో ప్రతిష్టాత్మకం అని  చేసే కొన్ని కొన్ని పనులు చూస్తుంటే, అవి చిత్తశుద్దితో చేసేవా లేక అస్మదీయులకు లబ్ది చేకూర్చాలని ఎవరో ఇచ్చిన సలహాలను ముందు వెనుక ఆలోచించకుండా తీసుకుంటున్న నిర్ణయాలా అని అనిపిస్తుంది. అలాంటిదే కోర్టు వారు చెల్లదని కొట్టివేసిన ఆధార్ కార్డులను తప్పనిసరిచేసే ప్రక్రియ.

గ్యాస్, విద్యుత్, తాగునీటి కనెక్షన్ లకే కాక, ఇక బవిష్యత్ లో ఏ ప్రభుత్వ సేవలను పొందాలన్నా “అధార్ కార్డు” అనేది కంపల్సరీ అని కేంద్ర ప్రభుత్వం వారు  ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాలను నానా హైరాన పెట్టారు.  గాస్ సబ్సీడి పొందాలంటే ఆదార్ కార్డు ఆదారంతో తెరచిన బాంక్ ఖాతా వివరాలు అందచేయాలని, పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రం లోని అయిదు జిల్లాలను ఎంపిక చేసామని, కాబట్టి ఆ యా జిల్లాల ప్రజలు మే లోపు ఆధార్ వివరాలు వివరాలు అటు బాంక్ లో నమోదు చేసుకుని ,అట్టి ఖాతా వివరాలను గాస్ డీలర్ కి  ఇవ్వాలని లేదంటే ‘సబ్సిడి కట్’ అంటె ఆధార్ అందని ప్రజలు, ఇంకా అధార్ అప్లై చేయని ప్రజలు ఆందోళన చేసారు. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు ఇప్పటికి రెండు సార్లు అనుకుంటా కేంద్ర ప్రభుత్వం గడువు తేదీలను పొడిగించింది. అటువంటి ప్రతిష్టాత్మక ఆదార్ ప్రాజెక్టు సుప్రీం కోర్టు వారి తీర్పుతో నిరాదారమై పోయింది.

aadhar_sl_-20--10--2012

“పౌరులుకు నిత్యావసర సేవలు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కోసం పట్టు బట్టడం పౌరుల ప్రాదమిక హక్కుల ఉల్లంఘణే” అని సర్వొన్నత న్యాయ స్తానం కుండ బద్దలు కొట్టింది. ఈ కేసులో  కేంద్ర సర్కార్ వారి ఏకైక డిఫెన్స్ ఏమిటంటే “మేము ఈ ప్రాజెక్టు కోసం యాబై వేల కోట్లు ఖర్చు పెట్టాము” అని మాత్రమేనంట!అంటె ప్రజల ప్రాదమిక హక్కులను ఉల్లంఘించే ఒకానొక పధకాన్ని ప్రభుత్వం ప్రెస్టేజియస్ గా బావించడమే కాక, దాని కోసం యాబై వేల కోట్లు ఖర్చుపెట్టిందన్న మాట!ఇదే కేసు వాదనల సందర్బంగా కేంద్ర కార్డుల జారీ అదార్టీవారు (UIDIA)   అన్నదేమిటంటే , ఆధార్ కార్డు తీసుకోవడం అనేది నిర్భందం కాదు పౌరుల ఇష్టం మీద అధారపడే సచ్చందం అది అని. మరి ఇంతోటి దానికి ప్రజలను ఇంత హైరానా పెట్టడం ఎందుకని కూడా సుప్రీం కోర్టు వారు పై విదంగా తీర్పు ఇచ్చారు.

చిత్తశుద్ది లేని సర్కార్ వారి పనులు చివరకు చేరేది అవినీతి కూపంలోకే అన్నమాట! అయినా ఒకర్ని అని ఏం లాభం! ప్రజలే ఎగబడి అవినీతి సామ్రాట్ లకు పట్టం కట్టడానికి తెగ ఉత్సాహా పడిపోతుంటేను!యదా ప్రజా! తదా ప్రజాసేవకా!

Advertisements

One thought on “యాబై వేల కోట్లు ప్రాజెక్టు గోవిందా..గోవిందా!

  1. It is doomed to failure since the day it was conceived. Nandan Nilekani failed miserably. From concept stage it did not make sense. Only some IT companies were benefitted.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s