ఆంధ్ర అన్యాయము లో ఎవరి భాగము ఎంత?

తెలంగాణా విభజన సమయములో ఆంధ్ర కి జరిగిన అన్యాయ పాపములో కేంద్రాల , పార్టీ ల భాద్యత ఎంత వుందో సీమంద్ర నాయకుల భాద్యత కూడా అంతే వుంది; 70 ఏళ్ళ వుమ్మడి ఆంద్ర ప్రదేశ్ చరిత్ర లో 99% పెత్తనము, CM లు సీమంద్ర వారిదే; చివరికి బొచ్చే పట్టుకొని హైదరాబాద్ ని వదిలి రావాల్సిన స్టేజి వచ్చ్సింది; ఆ నాయకులూ చేసిన రాజకీయము అలాంటిది.

శ్రీ సిటీ, మేధా టవర్ లాంటి మరి కొన్ని సీమంద్ర నగరాల్లో కట్టవద్దు అని ఆ సీమంద్ర నాయకులకు ఎవరన్న చెప్పారా?ఎవరన్నఆనకట్ట వేసారా?మా ప్రాంతాన్ని, మా నగరాలను, ద్వితీయ స్థాయి నగరాలను అభివృద్ది చేసుకుంటాము అంటే సీమంద్ర నాయకులను ఎవరన్న అపారా?

మన నాయకులకు హైదరాబాద్ మీద మోజు, హైదరాబాద్ లో తమ తమ ఆస్తులను పెంచుకునోవతములో వున్న మోజు సీమంద్ర ప్రజల మీద లేదు; మన బంగారము మంచిది అయితే పక్కోడు మన మీద భాద్యత వహిస్తాడు; ఒక వేల విభజన జరిగితే మీకు ఏమి కావాలి రాజధానిగా ఏమి కావాలో మీరు మీరు చర్చ చేసుకొని నిర్ణయము చేసుకోండి అంటే ఒకళ్ళు విజయవాడ, ఒకళ్ళు గుంటూరు , ఒకళ్ళు కర్నూల్, ఒకళ్ళు కడప, ఒకళ్ళు విశాఖ అంటూ విభిన్న వాదనలు వినిపించారు; ఐకమత్య లేమి ని చూసి కేంద్ర పార్టీలు మీ పని ఇలా ఉందా మా ఇష్టమొచ్చింది మేము చేస్తామన్నారు;

విభజన ఇష్టమే , ఇష్టమే అని ఒకటికి 4 సార్లు లెటర్ లు ఇచ్చిన సీమంద్ర పార్టీ లు విభజన జరిగితే ఇది ఇవ్వండి అని పట్టు పట్టలేకపోయాయి; అన్యాయము జరుగుతోంది అని తెలిసిన రోజు కూడా మీకు చేతకాకపోతే మాకు అధికారము ఇవ్వండి 6 నెలల్లో అభివ్రుద్హ్ది అంటే ఏమిటో చూపుతాము అని సవాలులు తొడలు గొట్టారు

మన అవకాశ వాద రాజకీయాలు మనవి, చివరికి ఆ తప్పులన్నీ రాష్ట్రము మీదకి , ప్రజల మీదకి పాపములా వచ్చి చుట్టుకున్నాయి

తెలంగాణా ఉద్యమ వ్యవహారములో ఎదో ఒక రోజున హైదరాబాద్ ను వదలి రావాల్సి వుంటుంది అని; అపుతాము అపుతాము అన్నారు కాని ద్వితీయ శ్రేణి నగరాలను అభివ్రుద్ది చేయద్దన్నారా? తెలంగాణా ఉద్యమము కాని హైదరాబాద్ మీద పట్టు కోసము పోరాటము కానీ ఒక్క రోజులో వచ్చింది కాడు 🙂 PLAN B ఎ రోజు వుంది? ఆ తప్పులో మన నాయకుల పాత్ర కూడా లేదంటారా? 70 ఏళ్ళ అధికార వికేంద్రికరణ లేని పాపాన్ని మనము 4 ఏళ్ళల్లో BJP మీద రుద్దేస్తునాము చాల తెలివిగా 🙂 కాంగ్రెస్ వచ్చిన ఇంతే జరిగేది. ఎవడో ఒకడు దొరకాలి తిట్లకు అంతే 😦

Advertisements